నేరేడు పండు వలన లాభాలు
👉 ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది చెందుతాయి
👉హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.
👉చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.
👉నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి
👉మధుమేహం రోగులకు చెక్కర స్ధాయిని నియంత్రణ లో ఉంచుతుంది
👉మొటిమలు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వాటికి ఇది ఉత్తమ నివారణగా పనిచేస్తుంది
👉పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది
👉 మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నావాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.
👉ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
👉నేరేడు తినడం వల్ల తరచూ దప్పిక వేయడం, యూరిన్‌కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
👉నేరేడులో విటమిన్ సీ,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది.
👉 కాల్షియం, పొటాసియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
👉ఈ పండు ఆకుల్ని దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు రావు.
👉ఆకు రసంలో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట, దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం కలుగుతుంది.
👉దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు.
👉 జిగట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాలా నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే రోగి శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటాయి.
👉 జ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
👉ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు మంచిది
👉నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది.
👉 జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది

